Health Tips in HindiHealth Tips

స్త్రీలలో నాజుకైనా శరీరాన్ని పొందుటకు 11 చిట్కాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jul 30, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

స్త్రీలు సన్నగా, స్లిమ్'గా కనపడుటకు వివిధ రకాల పద్దతులను పాటిస్తారు. నాజుకైనా శరీరాన్ని పొందటానికి ఎక్కువ కష్ట పడవలసిన అవసరం లేదు! నమ్మకం కలగట్లేదా! అయితే ఇక్కడ ఇచ్చిన పద్దతుల ద్వారా మీ శరీర భాగంలో కొవ్వు పదార్థాలు తగ్గి నాజుకైనా శరీరాన్ని పొందుతారు.
 • 1

  సరైన సమయం పాటు నిద్ర

  నిద్ర లేకపోవటం వలన చాలా రకాల ఆరోగ్య సమస్యలతో పాటు బలహీనంగా అవుతారు. ప్రతి రోజు 8 గంటల సమయం నిద్ర అవసరం. నిద్ర సరిగా పోవటం వలన ఆరోగ్యం సరిగా ఉంటుంది మరియు ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురవరు. Image Courtesy@www.gettyimages.in

 • 2

  ఎక్కువ నీటిని తీసుకోండి

  కనీసం ప్రతి రోజు 2 నుండి 3 లీటర్'ల నీటిని తాగటానికి ప్రయత్నించండి. కెఫీన్ మరియు టీలను తక్కువగా తాగండి కారణం వీటి వలన నిద్రాభంగం కలిగే అవకాశం ఉంది. ఎక్కువ నీటిని త్రాగటం వలన పేగులు శుభ్రం చెంది జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది మరియు జీర్ణక్రియలో ఎలాంటి సమస్యలు కలుగవు. నీటి వలన ఇలాంటి ఉపయోగాలు మాత్రమె కాకుండా, సరైన స్థాయిలో నీటిని తీసుకోవటం వలన మెరిసే చర్మాన్ని కూడా పొందుతారు. Image Courtesy@www.gettyimages.in

 • 3

  అల్పహరాన్ని మరవకండి

  మీరు రోజు ఉదయాన అల్పహారణ సేకరణను మాత్రం మరవకండి. విటమిన్ మరియు ప్రోటీన్'లు అధికంగా ఉన్న ఆహారాలను అల్పాహారంగా తీసుకోండి. అంతేకాకుండా, మంచి కొవ్వు పదార్థాలను అందించే వాటిని కూడా మీ అల్పహారంలో కలుపుకోవటం మర్చిపోకండి.Image Courtesy@www.gettyimages.in

 • 4

  చల్లటి ద్రావణాలను తాగకండి

  మీ శరీరానికి కావలసిన వాటిని అందించండి, అంతేకాకుండా ఫ్రిజ్'లో ఉండే చల్లటి ద్రావణాల వంటి అవసరం లేని వాటికి కూడా దూరంగా ఉండండి. కారణం ఈ ద్రావణాలు పోషకాలను కలిగి ఉండకుండా, మీ శరీర బరువును మాత్రమె పెంచుతాయి. చల్లటి ద్రావణాలను ఎక్కువగా తీసుకోవటం వలన మీ శరీరంలోని ఎముకలు మరియు దంతాలను క్రమంగా నశింపచేస్తాయి అని పరిశోధనలలో వెల్లడయింది.Image Courtesy@www.gettyimages.in

 • 5

  ఒత్తిడి తగ్గించటం

  ఈ మారుతున్న కాలంలో మన పనిలో కానీ లేదా ఇతరేతర సమస్యల వలన ఒత్తిడికి చాలా సాధారణంగా గురవుతుంటాము వీటి వలన మన జీవన శైలిలో మార్పులు కూడా సహజం అని చెప్పవచ్చు. కావున, ఈ ఒత్తిడులను జయించి, మీ కండరాలను విశ్రాంతి పరచి, ఆరోగ్యాకరమైన శరీరాకృతిని పొందటం చాలా అవసరం. ధ్యానం, యోగా, మరియు శ్వాస సంబంధిత వ్యాయామాల వంటి పద్దతులను అనుసరించటం వలన ఒత్తిడి నుండి ఉపశమనం పొంది మీ ఆరోగ్యాన్ని మరియు శరీరాకృతిని పొందవచ్చు.Image Courtesy@www.gettyimages.in

 • 6

  వ్యాయామాలు

  వారంలో కనీసం 4-5 సార్లు, 30-40 నిమిషాల వరకు వ్యాయామాలు చేయాటం తప్పని సరి. జాగింగ్, వాకింగ్ వంటి సాధారణ వ్యాయమాల ద్వారా మీరు మంచి శరీర ఆకృతిని పొందవచ్చు. ఇలా చిన్న చిన్న వ్యాయమాల ద్వారా మీ శరీరంలో ఉండే అధిక కొవ్వు స్థాయిలు కరిగిపోతాయి.Image Courtesy@www.gettyimages.in

 • 7

  పచ్చని ఆకుకూరలను మరవకండి

  పచ్చని ఆకుకూరలు మరియు పాల ఉత్పత్తులు మీ రుచి గ్రంధులను సంతృప్తి పరుస్తాయి, అంతేకాకుండా ఇవి మానవ శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటాయి. పచ్చని ఆకుకూరలు ఐరన్, విటమిన్ 'B' మరియు కాల్షియం వంటి మూలకాలను కలిగి ఉంటాయి. కనీసం వారానికి రెండు సార్లు ఆకుకూరలను మరియు రోజులో ఒకసారైన పాలు లేదా పాల ఉత్పత్తులను తీసుకోండి. Image Courtesy@www.gettyimages.in

 • 8

  వివిధ రకాలను కలపండి

  ఆరోగ్యకరమైన ఆహరం తినటం చాలా ముఖ్యం కానీ తినే ఆహారంలో వివిధ రకాలు ఉండటం కూడా చాలా అవసరం. మీరు తినే ఆహారానికి వివిధ రకాలను కలపడం వలన, శరీరానికి కావలసిన మరియు శరీరానికి అందని పోషకాలు కూడా పొందవచ్చు. కావున రోజు ఒకే రకమైన ఆహర పదార్థాలను మాత్రమె కాకుండా మీ ఆహరంలో వివిధ రకాల ఆహార అంశాలను కలపండి.Image Courtesy@www.gettyimages.in

 • 9

  ఆహరం సరిగ్గా తినండి

  మీ జీర్ణాశయం సహాయం అందించుటకు మీరు తినే ఆహరాన్ని సరిగ్గా నమలండి. ఆహరాన్ని మింగటానికి ముందుగా కనీసం 32 సార్లు నమలటం తప్పని సరి. కావున ఆహరం తినేటపుడు నెమ్మదిగా తినండి. మీరు తినే ఆహర పరిమాణం పెద్దగా ఉన్నట్లయితే జీర్ణం చెందించుటకు చాలా సమయం పట్టవచ్చు. Image Courtesy@www.gettyimages.in

 • 10

  మీ ఫోన్ ఆఫ్ చేయండి

  మీరు పాడుకోటానికి ముందుగా ఫోన్ మరియు ఇతరేతర విద్యుత్  పరికరాలను ఆఫ్ చేయండి. వీటి వలన వచ్చే రేడియేషన్ వలన ఆరోగ్య సమస్యలు మాత్రమె కాకుండా నిద్రాభంగం  అయ్యే అవకాశం ఉంది.Image Courtesy@www.gettyimages.in

 • 11

  నవ్వే ముఖంతో మేల్కొండి

  నిన్నటి రోజులో ఉండే సమస్యలను గుర్తు తెచ్చుకుంటూ లేవటం వలన ప్రస్తుత సమయాన్ని నాశనం చేస్తుంది. కావున మీ రోజును చిన్న నవ్వుతో ప్రారంభించండి మరియు మీ సమస్యలను అధిగమిస్తాను అనే ఉద్దేశ్యంతో నిద్రలోంచి మేల్కొనండి. మంచి ఆశతో, శక్తివంతమైన దృడ నమ్మకంతో రోజును ప్రారంభించండి. Image Courtesy@www.gettyimages.in

  Tags:
 • మంచి శరీరాన్ని పొందుటకు మార్గాలు
 • ఫిట్'గా ఉన్న శరీరాన్ని పొందుటకు మార్గాలు
 • ఆరోగ్యాన్ని పెంపొందించే మార్గాలు
 • Tips to get Slim Body in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

 • అన్ని

 • వ్యాసం

 • స్లైడ్ షో

 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ