Health Tips in HindiHealth Tips

గర్భ సమయంలో కలిగే వెన్నునొప్పులను తగ్గించే 10 మార్గాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jul 31, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

గర్భసమయంలో వెన్నునొప్పులు చాలా సాధారణం అని చెప్పవచ్చు. వీటి వలన చాలా ఇబ్బందులను పడుతుంటారు. కానీ ఇక్కడ తెలిపిన సూచనల సూచనల ఫలితంగా వెన్నునొప్పులను తగ్గించుకోవచ్చు.
  • 1

    విశ్రాంతి తీసుకోండి

    గర్భ సమయంలో వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందుటకు సరైన భంగిమలో పడుకోవటం చాలా ముఖ్యం. కనీసం పడుకునే సమయంలో ఒక మోకాలిని వంచి పడుకోండి. మీ మోకాళ్ళ మధ్య దిండును ఉంచండి మరియు రెండవ దిండును మీ నడుము కింద లేదా పడుకోటానికి సౌకర్యవంతంగా ఉండటానికి ప్రేగ్నంసి దిండును వాడుకోండి. పడుకునేటపుడు రెండు కాళ్ళను సూటిగా చాపి పడుకోకండి, ముఖ్యంగా మూడవ త్రైమాసిక దశలో ఇలా పడుకోకండి, దీని వలన కండరాలు ఎక్కువ ఒత్తిడికి గురి అవుతాయి.

  • 2

    సరి అయిన వాటిని ధరించండి

    గర్భంతో ఉన్న ఆడవారు బలహీనమైన కీళ్ళను కలిగి ఉండటం వలన త్వరగా ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంది. కావున కండరాలకు బాహ్య మద్దతు తప్పనిసరి. మీ ఉదర భాగానికి మద్దతుగా ఉండే దుస్తువులను లేదా ఎక్కువ ఎలాస్టిక్ గుణాలను కలిగి ఉండే ప్రసవ సమయంలో ధరించే ప్యాంట్'లను ధరించండి. ఇవి గర్భం పైన ఎలాంటి ఒత్తిడిని కలిపించకుండా సౌకర్యవంతంగా ఉంటాయి. అంతేకాకుండా మీ వెన్నెముక పైన ఒత్తిడిని పడకుండా సహాయపడతాయి.

  • 3

    బరువులను ఎత్తకండి

    రెండు పౌండ్ల కన్నా ఎక్కువ బరువు ఉండే ఏ వస్తువులను అయిన ఎత్తకండి. బరువు ఉండే వస్తువులను ఎత్తవలసి వస్తే మీ కుటుంబ సభ్యుల సహాయం తీసుకోండి. ఒకవేళ మీరే ఇలాంటి బరువు వస్తువులను ఎత్తవలసి వస్తే మీ కాళ్ళ ఆధారంగా ఎత్తండి కానీ మీ గర్భం పైన దాని ప్రభావం పడకుండా జాగ్రత్త పడకండి. మీ నడుము వంచటానికి బదులుగా మోకాళ్లను వంచి బరువు ఎత్తండి.

  • 4

    భౌతిక కార్యకలాపాలు

    గర్భంతో ఉన్న ఆడవారి శరీరంలో ఉండే కీళ్ళు చాలా బలహీనంగా మారి, తక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉండి, త్వరగా గాయాలకు గురవుతుంటాయి, ముఖ్యంగా వారి వెన్నెముక ప్రాంతం. రోజు చిన్న చిన్న వ్యాయామాలను చేయటం వలన మీ వెన్నెముక బలంగా మారి, గర్భంతో ఉన్న ఆడ వారిలో కలిగే వెన్ను నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు. మీ వైద్యుడి నుండి అనుమతి లభించిన తరువాత చిన్న చిన్న వ్యాయామాలను, వాకింగ్, స్విమ్మింగ్ వంటి వాటిని చేయండి. మీరు చేసే వ్యాయమాలకు ముందుగా వైద్యుడిని సంప్రదించటం చాలా అవసరం.

  • 5

    ఎత్తుగా ఉండే చెప్పులను వాడకండి

    గర్భంతో ఉన్న ఆడవారు ఎత్తుగా ఉండే చెప్పులను వాడకూడదు. మీకు ఎత్తుగా ఉండే చెప్పులను ధరించటం చాలా ఇష్టం ఉన్న, గర్భ సమయంలో మాత్రం వీటి వాడకం నిలిపివేయాలి. తక్కువ ఎత్తు ఉన్న షూ మరియు గర్భానికి మద్దతు ఇచ్చే వాటిని వాడటం మంచిది.

  • 6

    నేరుగా నిలబడండి

    గర్భంతో ఉన్న ఆడవారిలో ముఖ్యంగా మూడవ త్రైమాసిక దశలో చాలా సాధారణం అని చెప్పవచ్చు, కారణం శరీరంలో పెరిగే శిశువు పెరుగుదల వలన గురుత్వాకర్షన మూలం మారుతుంది. నిటారుగా నిలబడటం వలన శరీర బరువు మీ కాళ్ళపైన పడి ఎలాంటి ఇబ్బందుల కలగవు. నిలబడినపుడు ఇతరుల సహాయం తీసుకోవటానికి ప్రయత్నించండి. ఎక్కువ సమయం నిలబడవలసి వస్తే విరామాలను తీసుకోండి.

  • 7

    సరిగా కూర్చోండి

    ఎక్కువ సమయం సరైన భంగిమలో కూర్చోక పోవటం వలన నడుము నొప్పి లేదా వెన్ను నొప్పి కలిగే అవకాశం ఉంది. కుర్చీలో వీపు సహాయంతో మరియు వెన్నెముక, మెడకు సౌకర్యవంతంగా కూర్చోండి. కూర్చునేటపుడు దిండుని వెన్నెముక క్రింది భాగంలో ఉంచి, సరిగా కూర్చోవటం వలన గర్భం పైన ఒత్తిడి లాంటివి పడవు.

  • 8

    వేడి లేదా చల్లటి మసాజ్ ప్రయత్నించండి

    వెన్ను భాగంలో నొప్పిగా అనిపించే కండరాలకు వేడి లేదా చల్లటి వాటిని తాకించటం వలన త్వరిత ఉపశమనం పొందుతారు. వెన్నుభాగంలో రాయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. వెన్ను నొప్పిగా అనిపించినపుడు కుటుంబ సభ్యులను రాయమనండి లేదా నిపుణులతో మసాజ్ చేపించుటకు ప్రణాలికను రూపొందించుకొండి. త్వరిత ఉపశమనం కోసం, హీట్ ప్యాడ్ లేదా మంచు ప్యాక్'లను ఉపయోగించి నొప్పి నుండి ఉపశమనం పొందండి. వేడి ప్యాడ్'కి బదులుగా వేడి టవల్ లేదా తువ్వాలను వాడటం చాలా మంచిది.

  • 9

    బెడ్'ను సరిగా ఉంచుకోండి

    సాధారణంగా మనము వాడే బెడ్'లు చాలా మృధువుగా ఉండే అధిక బరువును మోయలేనివిగా ఉంటాయి, కావున మంచి బెడ్'ను వాడండి. గర్భినులకు సరి అయిన భంగిమలో విశ్రాంతి లేదా నిద్ర చాలా ముఖ్యం అని చెప్పవచ్చు.

  • 10

    వైద్యుడిని సంప్రదించండి

    వెన్ను నొప్పి అనేది మూత్రాశయ ఇన్ఫెక్షన్ లేదా ప్రసవానికి గుర్తులుగా కూడా చెప్పవచ్చు. మీ శరీరంలో ఎవైన గాయాలు లేదా నొప్పులను అలిగి ఉన్నట్లయితే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి. అంతేకాకుండా వైద్యుడిని సంప్రదించకుండా మీరు ఎలాంటి మందులను వాడకూడదు.

    Tags:
  • గర్భ సమయంలో వెన్నునొప్పి
  • గర్భ సమయంలో వెన్నునొప్పి తగ్గించుకోటానికి మార్గాలు
  • వెన్ను నొప్పికి నివారణలు
  • Back Pain During Pregnancy in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • 10 రోజుల్లో 10 ఇంచులు తగ్గించే చిట్కాలు

    బరువు తగ్గటం సులువు కాదనే చెప్పాలి, శరీర బరువు తగ్గించుకోటానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు, కానీ, తగిన ఫలితాలను కొంతమంది మాత్రమే పొందుతున్నారు. నిరా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • 10 రోజుల్లో 10 ఇంచులు తగ్గించే చిట్కాలు

    బరువు తగ్గటం సులువు కాదనే చెప్పాలి, శరీర బరువు తగ్గించుకోటానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు, కానీ, తగిన ఫలితాలను కొంతమంది మాత్రమే పొందుతున్నారు. నిరా