Health Tips in HindiHealth Tips

ఎముకల ఆరోగ్యాన్ని పెంచి, దృడపరిచే 10 చిట్కాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Oct 27, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

శరీరంలో జరిగే అన్ని క్రియలకు మరియు శరీరానికి మద్దతు ఇచ్చే వ్యవస్థగా ఎముకలను పేర్కొనవచ్చు అవునా! ఎముకలు ఆరోగ్యంగా ఉంటేనే శరీరంలో అన్ని విధులు సరైన విధంగా నిర్వహించబడతాయి. ఎముకలు ఆరోగ్యంగా దృడంగా ఉండుటకు తీసుకోవలసిన ఆహారాలు మరియు క్రియల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    బలమైన ఎముకల నిర్మాణం

    శరీరంలో జరిగే అన్ని క్రియలకు మరియు శరీరానికి మద్దతు ఇచ్చే వ్యవస్థగా ఎముకలను తెలుపవచ్చు; కావున ఎముకలను బలంగా మరియు ఆరోగ్యకరంగా ఉంచుకోవటం మన భాద్యత. మీ జీవనశైలిలో అనుసరించే అలవాట్లపై కూడా మీ శరీర ఎముకల దృడత్వం మరియు ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.Image Courtesy : Getty Images

  • 2

    కాల్షియం తీసుకోటాన్ని అధికం చేయండి

    ఎముకలు దృడంగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి కాల్షియం తప్పని సరి అని చెప్పవచ్చు. అధిక మొత్తంలో కాల్షియంను కలిగి ఉండే ఆహార పదార్థంగా పాలను చెప్పవచ్చు. రోజు తక్కువ ఫాట్ కలిగిన రెండు గ్లాసుల పాలు మరియు హోల్ గ్రైన్స్'లను తినటం వలబ శరీరానికి కావలసిన కాల్షియంను పొందవచ్చు.  Image Courtesy : Getty Images

  • 3

    దృడమైన ఎముకల కోసం విటమిన్ 'D'

    బలమైన మరియు ఆరోగ్యకరమైన ఎముకల నిర్మాణంలో కాల్షియం పాత్రతో సమానమైన పాత్ర విటమిన్ 'D' కూడా పోషిస్తుంది. గుడ్డులో శరీరానికి కావలసిన స్థాయిలో విటమిన్ 'D' ఉంటుంది మరియు ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. గుడ్డులోని పచ్చసోనలో మాత్రమే విటమిన్ 'D' ఉంటుంది.Image Courtesy : Getty Images

  • 4

    తగిన స్థాయిలో ఉప్పు

    అధిక ఉప్పు సేకరణ వలన శరీరంలోని కాల్షియం స్థాయిలు తగ్గే అవకాశం ఉంది. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలను తినటం వలన శరీరంలో ఉన్న కాల్షియం మూత్రం ద్వారా భయటకు పంపబడుతుంది. ఉప్పు తక్కువగా ఉన్న ఆహార సేకరణ వలన మీ ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.Image Courtesy : Getty Images

  • 5

    ఒమేగా-3 ఫాటీ ఆసిడ్'లను మరవకండి

    చేప మాంసం, శరీరానికి కావలసిన పోషకాలను అందించి, ఎముక ద్రవ్యరాశిని పెంచుతుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉండుటకు 'సార్డైన్' మరియు 'సాల్మన్' చేపలను తినండి. అధిక మొత్తంలో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్'లతో పాటూ, కాల్షియం మరియు విటమిన్ 'D'లు అధికంగా ఉన్న వాటిని తినటం వలన ఎముకల ఆరోగ్యం పెంపొందించబడి, దృడంగా మారతాయి.Image Courtesy : Getty Images

  • 6

    ప్రయోజనాలను చేకూర్చే స్నాక్స్

    ఆరోగ్యకరమైన స్నాక్స్'లను తినటం వలన వివిధ మార్గాల ద్వారా ఎముకల ఆరోగ్యం పెంపొందించబడుతుంది. వేరుశనగ మరియు బాదంల నుండి ప్రోటీన్, శరీరానికి అవసరమైన పోషకాలతో పాటూ, ఎముకల దృడ నిర్మాణానికి అవసరమైన పోషకాలు అందించబడతాయి. ఆక్రోటుకాయలు మరియు ఫ్లాక్స్ సీడ్స్'ల నుండి ఎముకలను దృడంగా ఉంచే ఒమేగా-3 ఫాటీ ఆసిడ్'లను అందిస్తాయి.Image Courtesy : Getty Images

  • 7

    పొటాషియం

    ఎముకల బలంగా ఉండటానికి మరియు ఆరోగ్యానికి, పొటాషియం నేరుగా ఉపయోగపడకపోయినా, కణాలలో వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. శరీరంలో కాల్షియంను భయటకి పంపించే ఆసిడ్'లను నిర్వీర్యపరుస్తుంది. చిలకడ దుంప, తెల్లటి బంగాళదుంప (బాహ్య చర్మం లేని బంగాళదుంప), యొగ్ హార్ట్ మరియు అరటిపండు వంటి వాటి వలన శరీరానికి తగిన స్థాయిలో పొటాషియం అందించబడుతుంది.Image Courtesy : Getty Images

  • 8

    ఎముకల ఆరోగ్యాన్ని పెంచే వ్యాయామాలు

    ఎముకల దృడత్వంతో పాటూ, వ్యాయామాల వలన అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. రన్నింగ్, వాకింగ్, జంపింగ్, మెట్లు ఎక్కటం వంటి వాటి వలన ఎముకల బలం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా, రోజు వ్యాయామాలను అనుసరించటం వలన ''ఒస్టియోపోరోసిస్'' అనే ఎముకల వ్యాధికి గురవకుండా కాపాడుకోవచ్చు.Image Courtesy : Getty Images

  • 9

    బలమైన ఎముకల కోసం సిగరెట్ మానేయండి

    సిగరెట్ తాగటం వలన శరీరంలో కాల్షియం గ్రహింపబడదని పరీశోధనలలో కూడా నిరూపించబడింది. దీని ఫలితంగా, ఎముకల మందం మరియు ద్రవ్యరాశి కూడా తగ్గుతుంది. సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉండటం వలన ఎముకలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా వివిధ రకాల ఊపిరితిత్తుల మరియు గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.Image Courtesy : Getty Images

  • 10

    కెఫీన్ సేకరణ తగ్గించండి

    రోజు రెండు కప్పుల కాఫీ ఆరోగ్యానికి మంచిదే, కానీ అధిక మొత్తంలో కెఫీన్ సేకరణ వలన శరీరంలో కాల్షియం గ్రహించే సామార్థ్యం కూడా తగ్గే అవకాశం ఉంది. కావున మీ శరీరంలో కాల్షియం స్థాయిలు పెరగాలి అనుకుంటే మాత్రం కాఫీ సేకరణను తగ్గించి, తగిన మొత్తంలో మాత్రమె తీసుకోండి. Image Courtesy : Getty Images

  • 11

    ఉదయపు ఎండలో నిలబడండి

    తీసుకునే ఆహారాల నుండి కాల్షియం గ్రహించే సామర్థ్యం తక్కువగా ఉన్నట్లయితే, విటమిన్ 'D' అవసరం. కానీ రోజు ఉదయాన ఎండలో నిలబడటం వలన విటమిన్ 'D' తయారుచేసే శక్తిని మన చర్మం కలిగి ఉంటుంది. కానీ 5 నిమిషాల కన్నా ఎక్కువ సమయం సూర్య కిరణాలకు బహిర్గతం అవటం వలన చర్మ కణాలు ప్రమాదానికి గురవుతాయి.Image Courtesy : Getty Images

    Tags:
  • ఎముకల ఆరోగ్యం
  • ఎముకలు దృడంగా ఉండుటకు సూచనలు
  • ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించే అలవాట్లు
  • ఒస్టియోపోరోసిస్
  • ఒస్టియోపోరోసిస్ కలగకుండా ఉండుటకు సూచనలు
  • Tips for strong bones in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • 10 రోజుల్లో 10 ఇంచులు తగ్గించే చిట్కాలు

    బరువు తగ్గటం సులువు కాదనే చెప్పాలి, శరీర బరువు తగ్గించుకోటానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు, కానీ, తగిన ఫలితాలను కొంతమంది మాత్రమే పొందుతున్నారు. నిరా
  • బరువు పెరగటానికి 10 చిట్కాలు

    బరువు పెరగటం అంత తెలికిన విషయం కాదు, ప్రణాళిక లేని బరువు పెరుగుదల వలన శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలు పెరిగి, వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలుగచేస
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • 10 రోజుల్లో 10 ఇంచులు తగ్గించే చిట్కాలు

    బరువు తగ్గటం సులువు కాదనే చెప్పాలి, శరీర బరువు తగ్గించుకోటానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు, కానీ, తగిన ఫలితాలను కొంతమంది మాత్రమే పొందుతున్నారు. నిరా
  • బరువు పెరగటానికి 10 చిట్కాలు

    బరువు పెరగటం అంత తెలికిన విషయం కాదు, ప్రణాళిక లేని బరువు పెరుగుదల వలన శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలు పెరిగి, వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలుగచేస