Health Tips in HindiHealth Tips

సోయా ఉత్పత్తుల వలన కలిగే 10 ప్రయోజనాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Mar 29, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

సోయా వలన ఆరోగ్యానికి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి వాటి గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • 1

    సోయా ఉత్పత్తులు

    చిక్కుడు విత్తనాలు, రక్షణ ఆహర పదార్థాలుగా అందరికి తెలిసిందే. అధిక మొత్తంలో ప్రోటీన్'లను కలిగి ఉండే చెట్టుగా దేనిని చెప్పవచ్చు, అందువలనే శాఖహారులు వీటి నుండే ప్రోటీన్'లను పొందుతారు. ప్రోటీన్'లు మాత్ర్రమే కాకుండా శరీరానికి కావలసిన అన్ని రకాల అమైనో ఆసిడ్'లు ఇందులో ఉంటాయి. చిక్కుడు గింజల ద్వారా వివిధ రకాల ఉత్పత్తులను పొందవచ్చు. ఇందులో సోయా ఫ్లోర్, సోయా పాలు, కాటేజ్ చీస్ ఇలాంటి చాలా రకాల ఉత్పత్తులు సోయా పాల నుండి పొందవచ్చు.Image Courtesy@www.gettyimages.in

  • 2

    గుండె సంబందిత వ్యాధుల నుండి రక్షణ

    జంతువుల నుండి పొందే ప్రోటీన్'ల కన్నా సోయా నుండి పొందే ప్రోటీన్'లు తక్కువ స్థాయిలో కొవ్వు పదార్థాలను పొందేలా చేస్తాయని శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. 'యూ.ఎస్. ఫుడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్' వారు విడుదల చేసిన గుండెకు ఆరోగ్యాన్ని సమకూర్చే ఆహార పదార్థాల పట్టికలో సోయా కూడా ఉంది.Image Courtesy@www.gettyimages.in

  • 3

    పౌరుష గ్రంధి క్యాన్సర్ నివారణ

    సోయా ఉత్పత్తులు ఫైటో ఈస్ట్రోజేన్'లను కలిగి ఉంటుంది, ఈ హార్మోన్ పురుషులలో టెస్టోస్టెరోన్ హార్మోన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఈ విధంగా టెస్టోస్టెరోన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుదల వలన పౌరుష గ్రంధి క్యాన్సర్ పెరుగుదల కూడా తగ్గుతుంది.Image Courtesy@www.gettyimages.in

  • 4

    పెద్ద పేగు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది

    సోయా ఉత్పత్తులు శరీరంలో కోలన్ క్యాన్సర్ లేదా పెద్దపేగు క్యాన్సర్ పెరుగుదలను నివారిస్తుంది అని శాస్త్రీయ పరమైన రుజువులు ఉన్నాయి. అంతేకాకుండా, సోయా ఉత్పత్తులు జీర్ణ వ్యవస్థ మరియు అన్న వాహికను ఆరోగ్యంగా ఉంచుతుంది.Image Courtesy@www.gettyimages.in

  • 5

    ఎముకల బలాన్ని పెంచుతుంది

    సోయా ఉత్పత్తులు కలిగి ఉండే ఫైటో ఈస్ట్రోజేన్'లు శరీరంలో కాల్షియం గ్రహించటాన్ని అధికం చేసి,  ఎముకల ద్రవ్యరాశి తగ్గుదలను నివారిస్తుంది. ఎముకల బలాన్ని పెంచుకోటానికి, విటమిన్ 'D' మరియు కాల్షియం అధికంగా ఉన్న సోయా ఉత్పత్తులను కొని రోజు వాడటం వలన ఎముకలు దృడంగా అవుతాయి.Image Courtesy@www.gettyimages.in

  • 6

    రోగనిరోధక శక్తిని పెంచుతాయి

    సహజ సిద్ద డిటర్జెంట్'లుగా పేర్కొనబడే, సాపోనిన్'లను సోయా ఉత్పత్తులు కలిగి ఉంటాయి. ఇవి పేగులలో కొవ్వు పదార్థాలతో బందాన్ని ఏర్పరుచుకొని శరీరంలోకి గ్రహింపబడకుండా చేస్తాయి, అంతేకాకుండా ఈ సాపోనిన్'లు సూక్ష్మజీవులను చంపి, రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి.Image Courtesy@www.gettyimages.in

  • 7

    మధుమేహ వ్యాధిని తగ్గిస్తుంది

    ఆరోగ్యకరమైన ఫైబర్ ఉన్న సోయా ఆహారాలను తీసుకోవటం వలన, శరీర రక్తంలో గ్లూకోస్ స్థాయిలు తగ్గుతాయి. మధుమేహ వ్యాధి గ్రస్తుల శరీర కణాలు ఇన్సులిన్'ను గుర్తుపట్టేలా చేసి, ఈ హార్మోన్ వలన కణాలలో గ్లూకోస్ గ్రహించాటాన్ని అధికం చేస్తాయి. Image Courtesy@www.gettyimages.in

  • 8

    మూత్రపిండాల సంరక్షణ

    సోయా సంబంధిత ఆహార పదార్థాలు మూత్రపిండాల విధిని సులభతరం చేస్తాయి. మూత్రపిండ సంబంధిత వ్యాధులతో భాదపడే వారు సోయా ఆహారాలను వారి రోజు ఆహర పత్యంలో కలుపుకోవటం వలన వ్యాధి సమస్యలు తగ్గుతాయి. సోయా ఉత్పత్తులు జంతువుల నుండి లభించే ప్రోటీన్'లను బదిలీ చేయటమే కాకుండా, విసర్జక పదార్థాల ద్వారా భయటకి పంపబడే ప్రోటీన్'ల నష్టాన్ని తగ్గిస్తుంది మరియు శరీరంలో పెరిగే ట్రై-గ్లిసరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది. Image Courtesy@www.gettyimages.in

  • 9

    రొమ్ము క్యాన్సర్ తగ్గుదల

    సోయా ఉత్పత్తులు ఐసో ఫ్లావనాయిడ్స్'లను కలిగి ఉంటాయి, ఇవి ఫైటో ఈస్ట్రోజేన్'ల వ్యవహరిస్తాయి. ఫైటోఈస్ట్రోజేన్ అనే రసాయనికాలు ఈస్ట్రోజేన్ చర్యను తటస్థీకరణం చెందించి, ట్యూమర్'ల ఏర్పాటును తగ్గిస్తుంది లేదా DNA మార్పులో జరిగే కణాలు రెట్టింపును అరికడుతుంది.Image Courtesy@www.gettyimages.in

  • 10

    రుతుక్రమం

    రుతుక్రమం సమయంలో, ఈస్ట్రోజేన్ ఉత్పత్తి గణనీయంగా పడిపోతుంది. దీని ఫలితంగా, వారు డిప్రెషన్, మానసిక కల్లోలాలకు, నిద్రలేమి మరియు ఇతరేతర మానసిక రుగ్మతలకు గురవుతుంటారు. సోయాలో ఫైటోఈస్ట్రోజేన్'లు ఉండటం వలన వాటి స్థానాన్ని భర్తీ చేస్తాయి. Image Courtesy@www.gettyimages.in

  • 11

    తక్కువ LDL స్థాయిలు

    సోయా ఉత్పత్తులను తినటం వలన అందులో ఉండే ప్రోటీన్'లు శరీరంలో ఉండే HDL స్థాయిలను ప్రభావిత పరచకుండా, LDL స్థాయిలను మరియు ట్రై-గ్లిసరైడ్'లను తగ్గిస్తాయి అని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. పాలీఅన్-సాచురేటేడ్ ఫాట్'లను కలిగి ఉండే సోయా వంటి ఆహార పదార్థాలు నేరుగా శరీరంలో ఉండే LDL స్థాయిలను తగ్గిస్తాయి.Image Courtesy@www.gettyimages.in

    Tags:
  • సోయా వలన కలిగే ప్రయోజనాలు
  • సోయా వాటి ఆవశ్యకత
  • రోగాలను తగ్గించుటలో సోయా ప్రాముఖ్యత
  • Health benefits of soya in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • సిగరెట్'లో ఉండే 10 ప్రాణాంతకర రసాయనాలు

    కొంత మంది సిగరెట్'లో ఉండే ప్రమాదకర రసాయనాల గురించి తెలియక వాటికి అలవాటు పడుతుంటారు. సిగరెట్'లో ఉండే రసాయనాల గురించి, వాటి వలన ఆరోగ్యానికి కలిగే నష్టాల
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • సిగరెట్'లో ఉండే 10 ప్రాణాంతకర రసాయనాలు

    కొంత మంది సిగరెట్'లో ఉండే ప్రమాదకర రసాయనాల గురించి తెలియక వాటికి అలవాటు పడుతుంటారు. సిగరెట్'లో ఉండే రసాయనాల గురించి, వాటి వలన ఆరోగ్యానికి కలిగే నష్టాల