Health Tips in HindiHealth Tips

శరీర బరువు తగ్గుటలో సహాయపడే ఆహారాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Dec 17, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయత్వంచే చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్నారు, కానీ, కొన్ని రకాల ఆహర పదార్థాలు కూడా శరీర బరువు తగ్గుటలో సహాయపడతాయి. ఇక్కడ తెలిపిన ఆహర పదార్థాలను తీసుకుంటూ, తగిన వ్యాయామాలను అనిసరిస్తూ శరీర బరువు తగ్గించుకోండి.
  • 1

    నీరు

    నీరు మీ శరీర బరువు తగ్గించుటలో ముఖ్య పాత్ర పోషిస్తుంది, నీరు ఎక్కువగా తాగే స్త్రీలు మరియు నీటి స్థాయిలను అధికంగా  కలిగి ఉన్న పండ్లు మరియు కూరగాయను తినే వారి శరీర బరువు తక్కువగా మరియు వారి నడుము చుట్టూ కొలత తక్కువగా ఉంటాయని "యూనివర్సిటీ ఆఫ్ టోక్యో" వారు తెలిపారు. కావున నీరు మరియు నీటిని ఎక్కువగా అందించే వాటిని అధికంగా తినండి.

  • 2

    నారింజ పండ్లు

    శరీర బరువును తగ్గించుటలో ముఖ్య పాత్ర పోషించే విటమిన్ 'C' మరియు ఫైబర్ లు ఈ పండ్లలో పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియ రేటును పెంచి, శరీర బరువు తగ్గుటను ప్రోత్సహిస్తాయి.

  • 3

    గ్రీన్ టీ

    శరీర బరువు తగ్గించుటలో గ్రీన్ టీ శక్తివంతంగా పని చేస్తుంది. దీనిలో ఉండే పాలీ-ఫినాల్స్, శరీరంలో ఉన్న ట్రైగ్లిసరైడ్ స్థాయిలను తగ్గిస్తాయి. అంతేకాకుండా, శరీర బరువు తగ్గించుకోవటానికి చేసే వ్యాయామాల సమయంలో శక్తిని అందించి వ్యాయామాలను ఉత్తేజంగా చేసేలా ప్రేరేపిస్తుంది.

  • 4

    బ్రోకలీ

    బ్రోకలీ క్యాన్సర్ ను తగ్గించే శక్తిని కూడా కలిగి ఉంటుంది, అంతేకాకుండా, ఇది అధిక మొత్తంలో ఫైబర్ స్థాయిలను కలిగి ఉంటుంది. వీటిలో ఉండే ఫైబర్ లు శరీర బరువు పెరగటాన్ని నివారించి, కొవ్వు పదార్థాలను తగ్గించటమే కాకుండా, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

  • 5

    సాల్మన్

    శరీర బరువు తగ్గించుటలో సాల్మన్ చేపలు శక్తివంతంగా పని చేస్తాయి, వీటిలో కొవ్వు పదార్థాలు శూన్యం అని చెప్పవచ్చు. శరీరానికి కావలసిన మరియు శరీర బరువు తగ్గించే ఒమేగా-3 ఫాటీ ఆసిడ్ లను పుష్కలంగా కలిగి ఉంటుంది. శరీర బరువు తగ్గించుకోవాలి అనుకునే వారు తప్పక వీటిని తినటం మరవకండి.

  • 6

    గుడ్డు

    గుడ్లు, శరీర కండరాల ద్రవ్యరాశిని పెంచటమే కాకుండా, బరువు తగ్గుటలో కూడా సహాయపపడతాయి. ఉదయాన అల్పాహారంగా, తక్కువ క్యాలోరీల ఆహారంతో పాటుగా గుడ్డు తినే వారిలో కొన్ని పౌండ్ల బరువు తగ్గుతుంది. గుడ్లు లేకుండా, అల్పాహారం తీసుకునే వారు అధిక క్యాలోరీలను పొందే అవకాశం ఉందని, "బటాన్ రూజ్" లో ఉన్న "లూసియానా స్టేట్ యూనివర్సిటీ" వారు తెలిపారు.

  • 7

    క్యాబేజీ

    పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్ మరియు విటమిన్ 'C' లను కలిగి ఉండి రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. రోజు మీరు అనుసరించే ఆహారంలో క్యాబేజీని కలిపుకొని తినటం వలన శరీరంలో కలిగే మార్పులను మీరే గమనిస్తారు.

  • 8

    బ్రౌన్ రైస్

    మీ శరీర బరువు తగ్గించాలి అనుకుంటున్నారా! అయితే బ్రౌన్ రైస్ ను తినండి. ఇది తక్కువ క్యాలోరీలను, ఫైబర్ స్థాయిలను అధిక మొత్తంలో కలిగి ఉంటుంది. వీటిని తినటం వలన ఎక్కువ సమయం పాటూ ఆకలి వేయకుండా ఉండి, మీ శరీర బరువు తగ్గుటలో సహాయపడుతుంది.

  • 9

    ద్రాక్ష పండ్లు

    ద్రాక్ష పండ్లు, గుండెను ఆరోగ్యంగా ఉంచే విటమిన్ 'C', ఫోలిక్ ఆసిడ్, పొటాషియం, పెక్టిన్ మరియు కరిగే ఫైబర్ లను కలిగి ఉండి, అథెరోస్క్లెరోసిస్ గురయ్యే అవకాశాలను తగ్గిస్తుంది. ద్రాక్ష పండ్లు ఆరోగ్యాన్ని ప్రభావిత పరచకుండా, శరీర బరువును తగ్గిస్తాయి. పండ్లు లేదా రసాన్ని కూడా తీసుకోవచ్చు.

    Tags:
  • శరీర బరువును తగ్గటం
  • బరువును తగ్గించే ఆహారాలు
  • బరువు తగ్గుటకు సూచనలు
  • Foods That Help Lose Weight in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • శరీర బరువు తగ్గుటలో సహాయపడే ఆహారాలు

    ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయత్వంచే చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్నారు, కానీ, కొన్ని రకాల ఆహర పదార్థాలు కూడా శ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • శరీర బరువు తగ్గుటలో సహాయపడే ఆహారాలు

    ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయత్వంచే చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్నారు, కానీ, కొన్ని రకాల ఆహర పదార్థాలు కూడా శ