Health Tips in HindiHealth Tips

చర్మాన్ని మెరుగుపరిచే 10 ఆహర పదార్థాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Mar 25, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

చర్మం మెరుగ్గా కనపడుటకు చాలా మంది బ్యూటీ పార్లర్'ల చుట్టూ, క్రీమ్'లను మరియు నూతన ఉత్పత్తులను వాడుతూ ఉంటారు. కానీ ఆరోగ్యకరమైన ఆహర పదార్థాల వలన మీ చర్మం సహజంగా మెరుగు పడుతుంది. వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • 1

    మెరుగైన చర్మం ఖచ్చితంగా అవసరం

    చర్మం తెల్లగా అవటానికి క్రీమ్స్, చికిత్స అవసరం లేదు. కొన్ని రకాల సహజ సిద్ధమైన ఆహారాలను తినటం వలన చర్మం తెల్లగా ఆకర్షణీయంగా మారుతుంది. 10 రకాల ఆహార పదార్థాలను తీసుకోవటం వలన మీ చర్మం స్పష్ఠంగా, తెల్లగా, ఆరోగ్యవంతమైన చర్మాన్ని పొందుతారు, అంతే కాకుండా ఈ ఆహర పదార్థాలను ఏ సమయంలో అయిన పొందవచ్చు.  

  • 2

    నిమ్మ రసం

    మెరిసే మరియు ఆరోగ్యవంతమైన చర్మం కోసం చాలా ఖరీదైన కాస్మెటిక్స్ వాడుతుంటాము. మెరిసే మరియు ఆరోగ్యవంతమైన చర్మం కోసం నిమ్మ రసం ప్రయత్నించండి. నిమ్మ రసం చర్మ లోపలి కణాలలోని నల్లటి మచ్చలను, ముడతలను పోగొట్టి యాంటీ-ఏజింగ్'లను కలిగి ఉంటాయి. నిమ్మకాయ సహజసిద్ధమైన బ్లీచ్'లా పని చేస్తాయి, ఇందులో విటమిన్ ‘C’ మరియు అసిడిటీ కారకాలు ఉంటాయి. ఈ కారకాలు చర్మం తెల్లగా అవటానికి ఉపయోగపడతాయి. Image Courtesy:Getty Images

  • 3

    బంగాళ దుంప

    పొటాటో జ్యూస్ మొహానికి పూయటం వల్ల చర్మంపై ఉండే నల్లటి మచ్చలను తగ్గిస్తుంది . ఇలా బంగాళ దుంప జ్యూస్'ని పూసి 20 నిమిషాల పాటూ ఉంచాలి. లేదా పొటాటో ముక్కతో మీ మొహం పైన మసాజ్ చేయాలి. బంగాళదుంపలోని కారకాలు ముఖం పైన ఉండే ఎర్రటి మచ్చలు, నల్లటి మచ్చలను తోలగించి చర్మానికి కాంతి వంతంగా చేస్తుంది.   Image Courtesy:Getty Images

  • 4

    టీ

    ఇంట్లో నానమ్మ చెబుతూ ఉంటుంది టీ తాగటం వల్ల చర్మం నల్లగా మారుతుందని. కానీ 'US' పరిశోధనలలో ప్రకారం తక్కువ పెరక్సిడేస్ (చర్మం మంట మరియు గరుకుని కలిగించేవి), మరియు టీలో 'పాలిఫీనోల్' వంటి బలమైన యాంటీ-ఆక్సీడెంట్'లని కలిగి ఉంటాయి. వీటి వలన చర్మం పైన ఉండే మచ్చలను తొలగిస్తాయి. ఎక్కువ టీ తాగటం వలన చర్మం నల్లగా మరే అవకాశం ఉంది. కావున రోజులో ఒకటి లేదా రెండు కప్పులు ఆరోగ్యకరం. Image Courtesy:Getty Images

  • 5

    చాక్లెట్

    అవును నిజమే! చాక్లెట్ వలన మీ చర్మం మెరుగుపడుతుంది. మీకు ఇష్టమైన డార్క్ చాక్లెట్ చర్మ కణాల అల్లిక మరియు 'UV' కిరణాల నుండి నిరోధక శక్తిని అందిస్తుంది. చర్మం తెల్లగా అవటానికి కావలసిన కోకో పాలి ఫినోల్స్ మరియు ఫ్లావనాయిడ్స్ వంటి అద్భుతమైన యాంటీ-ఆక్సిడెంట్'లు చాక్లెట్' లో ఉంటాయి. కావున రోజుకి రెండు జతల చాకొలేట్ లని సంతోషంగా తినొచ్చు. Image Courtesy:Getty Images

  • 6

    విటమిన్ ‘C’

    పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా విటమిన్ ‘C’ ని ఎక్కువగా కలిగి ఉంటాయి. ఈ విటమిన్ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు తెల్లగా మారుస్తుంది . చర్మవ్యాధి నిపుణులు అందరు విటమిన్ ‘C’ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినమని సలహా ఇస్తారు. మీరు ఎక్కువగా–కివి ఫ్రూట్, స్ట్రాబెర్రీ, చేర్రీస్, టమాట మరియు సిట్రస్ పండ్లని ఎక్కువ తినటం మంచిది. Image Courtesy:Getty Images

  • 7

    ఎరుపు మరియు పసుపు రంగు పండ్లు

    ఈ రకమైన పండ్లలో ఎక్కువగా ఫైటో రసాయనాలు మరియు కేరోటిన్స్ ఉంటాయి. ఈ రకమైన యాంటీ-ఆక్సిడెంట్స్ చర్మానికి నిరోధక శక్తిని ఇస్తాయి. క్యారేట్స్, మాంగోస్, పంప్కిన్ వంటి ఎరుపు మరియు పసుపుపచ్చ పండ్లు కూరగాయలను ఎక్కువగా తినండి. Image Courtesy:Getty Images

  • 8

    సోయాబీన్

    ఇది మీకు ఇష్టమైన ఆహరం కాకపోవచ్చు. కానీ ఇది యాంటీ -ఏజింగ్'లా పని చేస్తుంది. ఇందులో ఉండే 'ఐసోఫ్లవోన్'లు 'ఫైటో ఇస్ట్రోజెన్' వంటి ఏజింగ్ కారకాలకు వ్యతిరేకంగా పని చేస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండేయాంటీ -ఆక్సిడెంట్స్ చర్మానికి కాంతిని చేకూరుస్తాయి. చర్మం తెల్లగా అవటానికి సోయాబీన్ నుండి తయారు చేసిన టోఫు లేదా సోయాబీన్ పాల పదార్థాలను ప్రయత్నించండి మంచి ఫలితాలను పొందుతారు. Image Courtesy:Getty Images

  • 9

    ఓట్ మీల్ & టమాటో ప్యాక్

    ఓట్ మీల్ మరియు టమాటో రెండింటిని కలిపి మొహానికి పూసుకోండి. 15 నిమిషాల తరువాత కడిగేయండి. ఓట్ మీల్ 'ఎక్సోఫోలిఎంట్'గా పనిచేస్తుంది మరియు టమాట చర్మానికి తేమని అందించే గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండింటి కలయిక వలన ప్రకాశవంతమైన, మృదువైన చర్మాన్ని పొందుతారు. Image Courtesy:Getty Images

  • 10

    బాదం మరియు తేనె కలిపిన పేస్ పాక్

    ఈ రెండింటి కలయికతో తయారుచేసిన మిశ్రమం వలన చర్మంపై  ఉండే మురికిని తొలగిపోతుంది. చర్మానికి తేమని అందించి మృదువుగాను, కాంతివంతంగాను మారుస్తుంది. పాలు, ఒక చెంచా తేనె, ఒక చెంచా నిమ్మ రసం, మరియు ఒక చెంచా బాదం నునె కలిపి ఈ పేస్ ప్యాక్'ని తయారు చేస్తారు. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూసుకొని ఒక 15 నిమిషాల పాటూ ఉంచి తరివాత కడిగేయాలి. Image Courtesy:Getty Images

  • 11

    పోప్పడిపండు

    చాలా మంది చర్మ వ్యాధి నిపుణులు పోప్పడి పండు ఫేస్ ప్యాక్'ని వాడండి అని సలహా ఇవ్వటానికి కారణం ఉంది.  పోప్పడి పండు పుష్కలమైన యాంటీ-ఆక్సిడెంట్'లను మరియు 'పపైన్' అనే ఎంజైమ్'ని కలిగి ఉంటుంది, ఇవి చర్మంలోని నిర్గ్జీవ కణాలని, మలినాలను తొలగిస్తుంది. ఒక గ్లాస్ పోప్పడి పండు జ్యూస్'ను ముఖానికి పూసుకోవటం వలన చర్మంలో చాలా అద్భుతాలు గమనిస్తారు. Image Courtesy:Getty Images

    Tags:
  • మెరుగైన చర్మం ఆహరం
  • తెల్లని చర్మం కోసం
  • అందంగా కంపడటానికి తీసుకోవలసిన ఆహారం
  • Beauty Tips in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

Comments

  • pawan20 Jan 2015
    Nice health tips

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ