మనందరం అపుడపుడు కొన్ని చెడు పద్ధతులను పాటిస్తుంటామనేది తెలిసిన విషయమే. కానీ, మీ రోజువారీ అలంకరణలకు ఒక ప్రాముఖ్యత ఉంది, కొన్ని విషయాలు పాటించడం వలన హాని కలుగుతుందని బహుశా మీకు తెలియకపోవచ్చు. మీ చర్మం మరియు ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని సాధారణ అలంకరణ అలవాట్లను ఇక్కడ తెలియచేయడమైనది.
సాధారణంగా మీరు మీ స్నేహితురాలితో మీ యొక్క అన్ని వస్త్రాలను మరియు ఆభరణాలను పంచుకుంటుంటారు --- కాబట్టి లిప్‌స్టిక్ ను కూడా అలాగే ఉపయోగించుకుంటారని చెప్పవచ్చు!
స్నేహితురాలితో మీ లిప్‌స్టిక్ రంగును పంచుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు ఒక మురికైన త్రోవలో తీసుకెళ్ళినవారవుతారు.
డేవిడ్ బ్యాంక్, ఎం.డి. న్యూయార్క్ లోని మౌంట్ కిస్కో 'చర్మవ్యాధి' నిపుణుడి ప్రకారం. "మీరు మీ స్నేహితురాలితో అలంకరణ సామాగ్రిని పంచుకోవడం వలన రోగకారత చెందే ప్రమాదం ఏర్పడుతుంది. ఐలైనర్స్ మరియు లిప్‌స్టిక్‌లను ఒకరిదొకరు ఉపయోగించుకోవటం వలన, కండ్లకలక మరియు జలుబు వంటి మొదలైన వైరల్ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం కలదు" ఆయన పేర్కొన్నారు.
"గడువు తేదీలను ఒక కారణం కోసం నిర్ణయించడం జరుగుతుంది, మరియు చాలా మంది గడువు ముగిసినా కూడా ఉత్పత్తులను బయట పారవేయట్లేదు" అని బ్యాంక్ తెలియచేసారు. మీ దగ్గరి వ్యర్థ పాలను గత వైభవాన్ని మరిచిపోయి ఎలా పారవేస్తారో అలాగే, మీరు ఎప్పటినుండో కలిగిన మాస్కరా లేదా లిప్‌స్టిక్ లేదా ఏదైనాసరే ఆ ఉత్పత్తిని ఉపయోగించకుండా వదిలించుకోవాలి. గడువు ముగిసిన ఉత్పత్తులను ఉపయోగించినట్లయితే గులాబీ కండ్లు లేదా చర్మ మంట వంటి అనేకమైన అవసరంలేని అంటురోగాల బారిన పడే ప్రమాదం కలదు.
ఒకసారి ఉత్పత్తులను ఉపయోగించటం ప్రారభించినపుడు వాటిపై అవి ఎంతకాలం పాటు యోగ్యకరంగా ఉంటాయో తెలియజేసే ఒక చిహ్నం, దాదాపు అన్ని ఉత్పత్తులపై ఉంటుంది. లైనర్స్ మరియు మాస్కరా వంటి ఉత్పత్తులు సాధారణంగా స్వల్ప జీవితకాలంను కలిగి ఉంటాయి మరియు రెబెక్కా టేలర్, ఎం.డి., 'అప్తాల్మోలోజిస్ట్ అండ్ అమెరికన్ అకాడమీ అఫ్ అప్తాల్మోలోజిస్ట్' ప్రతినిధి ప్రకారం, అలంకరణ సామాగ్రిని ఎపుడైనా మూడు నెలల్లో వదిలించుకోవటం సరైనది అని సిఫార్సు చేయడం జరిగింది.
ఒకవేళ మీరు రాత్రి మీ అలంకరణను కూడా తీసివేయనంత అధికంగా అలసిపోయారా? అయితే, ఉదయాన మీరు విస్తృతమైన సమస్యలతో మేల్కొనవచ్చు, నిత్యం ఫౌండేషన్ క్రీంతో నిద్రించడం వలన మీ చర్మం మరియు కళ్ళు రెండూ దెబ్బ తినవచ్చు. "మేకప్ అలానే ఉంచుకొని నిద్రించడం వలన అది మీ స్వేద రంధ్రాలను మూసివేయడానికి దారితీస్తుంది, దీని వలన కండ్ల మంట ఏర్పడవచ్చు" అని బ్యాంక్ తెలియచేసారు. "రాత్రిళ్ళు మీ తలను అటు ఇటు త్రిప్పినప్పుడు, మేకప్ మిగుళ్ళు మీ కంటి వరకు వెళ్ళవచ్చు." కంటి మేకప్ ఉత్పత్తులు వివిధ రకాల నూనెలు మరియు మైనాలు కలిగి ఉంటాయి, మరియు ఈ ఉత్పత్తులు రాత్రంతా కంటి మీద ఉండడం వలన, దానిలోని పదార్థాలు స్వేద రంధ్రాలను మూసివేస్తాయి, ఫలితంగా కంటి సమీపంలోని చర్మంపై దద్దుర్లు ఏర్పడుతాయి.
"కొన్ని లాష్ ఎక్స్టేన్షన్స్ ఉత్పత్తులు ఫార్మాల్డిహైడ్ ను కలిగి ఉంటుంది, ఇది కళ్ళను చికాకుపరచవచ్చు" అని కూడా టేలర్ తెలియచేయటం జరిగింది. దీనిని పేలవంగా పెట్టుకోవడం వలన, కనురెప్పల వెంట్రుకలు పెళుసులుగా మారడానికి మరియు తెగిపోవడానికి కూడా కారణమవుతుంది. కావున, సరైన భద్రత చర్యలు పాటించినంత కాలం వరకు లాష్ ఎక్స్టేన్షన్స్ చేసుకోవడం సురక్షితమే. లాష్ ఎక్స్టేన్షన్స్ ఉత్పత్తులను అధికంగా ఉపయోగించటం వలన కనురెప్పల వెంట్రుకలు కోల్పోవటానికి కారణం కావచ్చని టేలర్ సిఫార్సు చేసారు.
"మీ కళ్ళు వాటి సొంత సహజ బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి, మరియు ఐలైనర్ పెన్సిల్స్ ఉపయోగించడం ద్వారా మీరు మీ కళ్ళకు పరాయి బాక్టీరియాను పరిచయం చేసినవారవుతారు. వివిధ అంటు రోగ సంక్రమణలు మరియు స్వేద రంధ్రాలు మూసుకోవడం వంటి సమస్యలు నివారించేందుకు, మీ లోపలి కనురెప్పలను లేదా వాటర్‌లైన్ లకు లైనర్ వేసుకోవడం మానుకోండి" - అని టేలర్ వివరించారు.
Image source:Gettyimages.in